కరీంనగర్ పోలీస్ కమిషనర్ కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు ఒక కుటుంబ సభ్యులుగా కలసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలు, ఇతర సంగీత నృత్యాల మధ్య ఆనందాలను పంచుకుంటూ ఈ వేడుకలను జరుపుకున్నారు.
అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు ఒక బృందంగా బయలుదేరి పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు అన్ని స్థాయిలకు చెందిన పోలీసులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు కమిషనర్ క్యాంపస్ నుండి మొదలుకొని డిఐజి కార్యాలయం వరకు నృత్యాల మధ్య వెళ్ళి డిఐజి కె రమేష్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, డిఐజి కె రమేష్ నాయుడు ల ఆధ్వర్యంలో వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వరకు బ్యాండ్ మేళలతో నృత్య ప్రయత్నం చేస్తూ వెళ్లి కలెక్టర్ అర్వి కర్ణన్ దంపతులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
హోలీ వేడుకల సందర్భంగా పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు తనకు ఎదురైన వికలాంగులను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా వారికి స్వీట్లు పంపిణీ చేశారు.