Friday, January 10, 2025
HomeNewsKTR: అరపైసా అవినీతి జరగలేదు: కేటీఆర్

KTR: అరపైసా అవినీతి జరగలేదు: కేటీఆర్

రాష్ట్ర ప్రతిష్ట కోసమే..

తాను అరపైసా అవినీతికి పాల్పడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో అన్నారు. తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికే తాను ఈ ఫార్ములా రేస్ ను నిర్వహించినట్టు, ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను ఎదుర్కొంటానని కేటీఆర్ వెల్లడించటం విశేషం. ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై పలు ప్రశ్నలను ఏసీబీ అధికారుల నుంచి ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో నేడు కీలక పరిణామం. ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్‌. నందినగర్‌ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్‌, న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి రావడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌ను ప్రశ్నిస్తారా? ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా అని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఉండగా, కేటీఆర్‌ నివాసానికి చేరుకున్న కవిత, హరీష్‌రావు, పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News