జనవరి 13 నుంచి 23 వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు రేవంత్ తెలిపారు. ఇందుకోసం ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. కాగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లే ప్రతిసారి కోర్టు నుంచి పాస్‌పోర్టును తీసుకుంటున్నారు.