Friday, January 10, 2025
Homeఆటవిడాకులపై క్లారిటీ ఇచ్చిన చాహల్ భార్య.. అసలు విషయం ఇదంట..!

విడాకులపై క్లారిటీ ఇచ్చిన చాహల్ భార్య.. అసలు విషయం ఇదంట..!

గత కొన్ని రోజులుగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ విడుకులు తీసుకోబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో చాహ‌ల్ స‌తీమ‌ణి ధ‌న‌శ్రీ వ‌ర్మ పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. మీడియాలో వస్తున్న వార్తల వల్ల తాను ఎంతో మానసిక వేదనకు గురి అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.

- Advertisement -

తనతో పాటు కుటుంభ సభ్యులు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ధనశ్రీ చెప్పింది. కొందరు నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని మండిపడింది. త‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా, త‌న పై ద్వేషం క‌లిగేలా ట్రోల్స్ చేస్తున్నార‌న్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డితేనే తాను ఈ స్థాయికి చేరుకున్నాన‌ని.. తాను మౌనంగా ఉన్నానంటే.. అంటే బలహీనంగా ఉన్నట్లు కాదని పేర్కొన్నారు.

సోష‌ల్ మీడియాలో ప్ర‌తికూల‌త ఉన్న‌ప్ప‌టికి ఇత‌రుల‌పై ద‌య‌, క‌రుణ చూపాలంటే అందుకు ధైర్యం అవ‌స‌రం అని అంది. తాను వాస్త‌వ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని, విలువ‌ల‌తో ముందుకు సాగాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చింది. దాన్ని స‌మ‌ర్థించుకోవాల్సిన అవ‌స‌రం లేదంది.

చాహ‌ల్, ధ‌న‌శ్రీ వ‌ర్మ‌లు 2020లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌ల ఒక‌రినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు విడిపోతున్నారు అనే వార్త‌లు మొద‌లు అయ్యాయి. అదే స‌మ‌యంలో చాహ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ధ‌న‌శ్రీతో ఉన్న ఫోటోల‌ను డిలీట్ చేశాడు. దీంతో వీరిద్ద‌రు విడిపోతున్నారు అనే వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లైంది. ఇక గ‌తంలోనూ ఓ సారి వీరిద్ద‌రు విడిపోతున్నారు అనే వార్త‌లు వైర‌ల్‌గా మార‌గా.. దీనిపై చాహ‌ల్ స్పందిస్తూ విడిపోవ‌డం లేద‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో రూమ‌ర్ల‌కు తెర‌ప‌డింది. తాజాగా మరోసారి వార్తలు రాగా.. ధన శ్రీ ఈ విధంగా స్పందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News