ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన పంతులు ముందు స్వప్న సీమంతం ఫంక్షన్‌లో ఏమి చేయాలి, వచ్చిన ముత్తైదువులకు రిటన్ గిఫ్ట్స్‌గా వెండి కుంకుమ బరినె ఇవ్వాలని, ఒక రకం టిఫిన్ కాకుండా రకరకాల భోజనం పెట్టాలని రుద్రాణి చెప్తుంది. మధ్యలో రాజ్ అంత గ్రాండ్‌గా చేయడం అవసరమా, ఎలాగో బారసాల చేస్తాముగా అంటాడు. స్వప్న కుడా తన సీమంతం అంత ఘనంగా జరుగుతుందా అని సంబంర పడుతుంది. ఏం కావ్య నీ అక్క సీమంతం చేయడం నీకు ఇష్టం లేదా అని అడిగితే నా అక్కకు సీమంతం చేయడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు అలాగే కానివ్వండి అంటుంది కావ్య. తర్వాత రాజ్, కావ్య గదిలోకి వెళ్లి ఎందుకు సీమంతానికి ఒప్పుకున్నావు అని అడుగుతాడు రాజ్.
మీ అత్తయ్య కావాలని నన్ను బాడ్ చేయడానికి ఇలా ప్లాన్ చేశారు అందుకే వాళ్ల ప్లాన్ వర్కౌట్ అవ్వనివ్వను. మీరు కంగారు పడకండి, నేను ఏమి ఆలోచించకుండానే మాట ఇస్తానా అంటుంది కావ్య. మా అక్క సీమంతం జరుగుతుంది కాని సింపుల్‌గా జరుగుతుంది అంటుంది. ధాన్యలక్ష్మి రూమ్‌లోకి రుద్రాణి వచ్చి ఇదంతా నీకోసమే చేస్తున్నా నా కోడలి మీద ప్రేమతో కాదు అర్ధం చేసుకో అంటుంది. ఇద్దరు కలిసి కావ్య ని బాడ్ చేయడానికి ప్లాన్‌లు వేస్తారు. మరోవైపు కవి కి తన డైరెక్టర్ ఫోన్ చేసి నువ్వు పైసాకి పనికిరావు అనవసరంగా నీకు అవకాశం ఇచ్చాను అని తిడుతాడు. చెప్పిన టైంకి పాట రాసి ఇవ్వలేదని చెడామడా తిట్టేస్తాడు. ఇంకో సీన్‌లో కావ్య వాళ్ల అమ్మదగ్గరకు వెళ్తుంది. ఈరోజు ఏమి షాక్ ఇవ్వడానికి వచ్చావు అని వాళ్ల అమ్మ అంటుంది.
ఏంటి మళ్లీ నీ మొగుడు పంపించేశాడా అంటుంది కనకం. కాదమ్మా నేను శుభవార్త చెప్పడానికి వచ్చాను అంటుంది కావ్య. అదీ స్వప్న అక్కకు సీమంతం చేద్దాం అనుకుంటున్నాము కానీ మేము కాదు చేసేది నువ్వు మన ఇంట్లో చేయాలి అంటుంది. మా అత్తారింట్లో అయితే ఆర్భాటాలకు పోయి లక్షలు ఖర్చు చేస్తారు. అదే ఇక్కడ అయితే సింపుల్‌గా అయిపోతుంది అంటుంది కావ్య. ఎందుకలా చేయాలి అని అడుగుతుంది కనకం. మన స్థాయి తెలిసి కుడా ఇక్కడ చేయమంటున్నావు ఎందుకు అని అడిగినా కావ్య చెప్పదు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంటుంది. సరే అని అక్కడకి వచ్చి మాట్లాడతాను, రుద్రాణిని ఎలా ఒప్పిస్తానో చూడు అంటుంది కనకం. అక్కడ రుద్రాణి సీమంతం కోసం ఫుల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. కావ్య 20 లక్షలకు చెక్ రాసి రుద్రాణికి ఇస్తుంటే ఈలోపు కనకం ఇంటికి వస్తుంది.