Friday, January 10, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 8th Episode: రవి, శృతిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభావతి,...

Gunde Ninda Gudigantalu January 8th Episode: రవి, శృతిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభావతి, బాలు అడ్డుకుంటాడా..

ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి దేవుడితో తన కుటుంబం బాగోగులు గురించి చర్చిస్తుంది. మీనా తప్ప మిగతా కోడల్ల రూపంలో వస్తున్న లక్ష్మీ దేవీ గురించి సంతోషపడుతుంది. గొంతెమ్మ కోరికలు కోరుకుంటుంది. అటు మీనా ని వంట ఇంకా చేయలేదా అని అరుస్తుంది. ఇద్దరూ మాట మాట అనుకుంటారు. తొందరగా వంట చేయమని గసురుకుంటుంది. సత్యం ఏమో ఎందుకు కంగారు పడుతున్నావు ఇంటికి ఎవరు వస్తున్నారు అని అడుగుతాడు కానీ చెప్పకుండా తప్పించుకుంటుంది ప్రభావాతి. బాలు ఇంకా ఇంట్లోనే ఉన్నాడని అనుకుంటూ ఎలా అయినా అర్జెంట్‌గా ఇంట్లో నుంచి పంపించాలని అనుకుంటుంది. మీనా ని బాలు ఎప్పుడు వెళ్తాడు తొందరగా పంపించు అంటుంది ప్రభావతి. తొందరగా టిఫిన్ తినేసి బాలుని వెళ్లమంటుంది.

- Advertisement -

బాలుకి టిఫిన్ పెడుతుంటే ఎంటి ఇది కలా నిజమా అంటాడు బాలు. మనోజ్‌ని ఆగమని మరీ బాలుకి తనే టిఫిన్ పెడుతుంది. ఇదంతా చూసి బాలు తట్టుకోలేక బాలు గుండెనెప్పి వచ్చేలా ఉంది వెళ్లి నాన్నను అడిగి టాబ్లెట్ తెమ్మని వెటకారం చేస్తాడు. ప్రభావతి చేసే పనులు చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. బాలు ఏమో కావాలని ప్రభావతి ఏదో చేయాలని చూస్తుందని బయటికి వెళ్లి లోపలికి రావడం అలా నాలుగు ఐదు చేసి ఆడుకుంటాడు.
అంతేకాకుండా అలా మనోజ్‌తో కుడా ఆడుకుంటాడు. ప్రభావతి ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి బాలు కడుపునెప్పి వస్తుందని బయటకు వెళ్లకుండా నాటకం ఆడుతాడు.

మొత్తానికి సత్యం అడిగితే శృతి, రవి వస్తున్నారాని చెప్తుంది. చివరికి శృతి వాళ్ల అమ్మానాన్న వచ్చి వాళ్లిద్దరిని ఇంట్లో అప్పచెప్పడానికి వస్తారు. మీనా ఇస్తున్న హారతి ఇస్తుంటే వద్దని రోహిణిని ఇమ్మంటుంది ప్రభావతి. ఇద్దరు వదినలు కలిసి ఇవ్వండి అని రవి అంటాడు. కుడి కాలు లోపల పెట్టి లోపలికి రమ్మంటే శృతి ఏమో అడ్డమైన ప్రశ్నలు వేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News