వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల(Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu), ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు తిరుమలకు వచ్చారు. ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్, తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.