Friday, January 10, 2025
HomeతెలంగాణVC sajjanar: జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌తో జాగ్రత్త: సజ్జనార్

VC sajjanar: జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌తో జాగ్రత్త: సజ్జనార్

సైబర్ మోసాలపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC sajjanar) ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా జంప్‌డ్ డిపాజిట్ స్కామ్(Jumped Deposit Scam) గురించి అవగాహన కల్పిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ స్కామ్‌కి సంబంధించి అవగాహన కల్పించే ఓ వీడియోను పోస్ట్ చేశారు.

- Advertisement -

“జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌తో జాగ్రత్త! అజ్ఞాత వ్యక్తుల నుంచి UPI నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వస్తే తెగ సంబరపడిపోకండి. ఆత్రుతగా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ ఎంటర్ చేశారో.. అంతే.. మీ ఖాతా గుల్ల అవుతుంది. బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే UPI ఐడీలకు పేమెంట్స్ లింక్ లను పంపి సైబర్ నేరగాళ్లు దోచేస్తేన్నారు. ఇలాంటి ఫేక్ పేమెంట్స్ లింక్స్ కి స్పందించొద్దు. మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి” అని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News