Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Telugu States: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

Telugu States: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పన్నుల్లో వాటా కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1,73,030 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు కేటాయించింది. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.

- Advertisement -

అయితే నిధుల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఏపీకి కేటాయించిన నిధుల్లో సగం కూడా తెలంగాణకు కేటాయించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News