నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన “డాకు మహరాజ్”(Daku Maharaj) ఈనెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్(Pre-release event) జనవరి 9న అనంతపురంలో గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి తిరుపతి(Tirupati) తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు చేయడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారు తమ వాహనాలను జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్ హాల్, మహ్మద్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు బాలయ్య అభిమానులకు కిక్ ఇచ్చేవిధంగా రెండో ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. బాలయ్య పవర్ పుల్ డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ ఉండనున్నట్టు సమాచారం.