అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి ఎం.పి. అభ్యర్థిగా రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. అధికారి దాసరి శ్రీనివాసులు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుత ఎం.పి. చింతా అనూరాధను డెల్టా గన్నవరం నుంచి అసెంబ్లీకు పంపనున్నట్లు విశ్వసనీయంగా తెలీయవచ్చింది.
మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేదల పక్షపాతిగా, ప్రజల తరఫున నిలిచే అధికారిగా సమర్ధుడిగా పేరుంది. అనేక రంగాలలో అనేక హోదాలలో పని చేసి విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి గామంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వుడా వైస్ చైర్మన్‌గా డాక్టర్ దాసరి శ్రీనివాసులు చేసిన అన్ని మంచి పనులను నేటికీ విశాఖ నగర గుర్తుచేసుకుంటారు.ఆయన హయాంలో ప్రారంభించిన కైలాసగిరి, రోప్‌వే, హెల్త్ ఎరీనా వంటి సుందర ప్రదేశాలను చిన్నారులందరూ ఆస్వాదిస్తున్నారు.
కాకినాడ పోర్ట్ డైరెక్టర్ గా,ప్రకాశం జిల్లా కలెక్టర్ గా, వుడా చైర్మన్ గా,పంచాయతీరాజ్ కమిషనర్ గా, సహకార శాఖ కమిషనర్ గా కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గా ఇంకా ఎన్నో కీలకమైన పదవులను ఆయన ఎంతో సమర్థవంతంగా చేపట్టారు.
ప్రస్తుతం అమలాపురం ఎంపిగా ఉన్న చింతా అనూరాధ తన నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఏనాడూ అందుబాటులో లేరనే విమర్శలున్నాయి. వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న “గడప గడపకు ప్రభుత్వం” అనే కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనలేదనీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమర్ధుడైన దాసరి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలన చేసింది.
AP: అమలాపురం వైసిపి ఎంపి అభ్యర్థిగా రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. దాసరి శ్రీనివాసులు?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES