Friday, January 10, 2025
HomeతెలంగాణBhatti Vikramarka: మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి భట్టి విక్రమార్క.. ఫ్లెక్సీ ఫొటో వైరల్

Bhatti Vikramarka: మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి భట్టి విక్రమార్క.. ఫ్లెక్సీ ఫొటో వైరల్

రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా ఈ నెల 8, 9 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు(World Telugu Conferences) జరిగాయి. ఈ మహాసభలు ప్రారంభోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులకు అహ్వానాలు అందాయి. దీంతో ఈ మ‌హాస‌భ‌ల‌కు హాజరయ్యే ప్రముఖులకు స్వాగతం పలుకుతూ నిర్వాహకులు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

అయితే ఓ పోస్టర్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటారా.. అందులో భారత మాజీ ఉప రాష్ట్రపతి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు స్వాగ‌తం అంటూ రాసి ఉంది. తెలంగాణకు డిప్యూటీ సీఎం అయిన భట్టికి భారత మాజీ ఉపరాష్ట్రపతి అని రాసి ఉండటం ఏమిటని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వెంకయ్యనాయుడుకు వేయాల్సిన పోస్టర్‌లో భట్టి విక్రమార్క ఫొటో వేసినట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News