Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్APPSC: పోటీ పరీక్షల తేదీల ప్రకటన.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?

APPSC: పోటీ పరీక్షల తేదీల ప్రకటన.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?

కొత్త ఏడాదిలో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ (APPSC) ప్రకటించింది. ఈమేరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. APPSC‌ ప్రకటించిన పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ పోస్టులు: ఏప్రిల్ 28న టౌన్ ప్లానింగ్ 1, ఏప్రిల్ 29న టౌన్ ప్లానింగ్ 2 పరీక్ష
  • మెడికల్ అండ్ హెల్త్ లైబ్రేరియన్ పోస్టులు: ఏప్రిల్ 27న సబ్జెక్టు పేపర్, ఏప్రిల్ 28న జనరల్ స్టడీస్ పరీక్షలు
  • అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు: ఏప్రిల్ 28న జనరల్ స్టడీస్, ఏప్రిల్ 30న సబ్జెక్టు పేపర్ 1 అండ్ 2 పరీక్షలు
  • అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ అండ్ డీజేబుల్డ్ ట్రాన్స్ జెండర్ పోస్టులు: ఏప్రిల్ 27న సబ్జెక్ట్ పేపర్ 1, ఏప్రిల్‌ 28న పేపర్‌ 2 పరీక్షలు
  • ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసు అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టు: ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు
  • ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టు: ఏప్రిల్ 28న పరీక్షలు
  • ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబర్డినేట్ సర్వీస్‌లో ASO పోస్టు: ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు
  • ఏపీ ఫిషరీ సర్వీస్‌లో ఫిసరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు: ఏప్రిల్ 28, 30 తేదీల్లో పరీక్షలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News