గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ సతీమణి ఉపాసన(Upasana) సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలో నువ్వు నిజంగానే ఓ గేమ్ ఛేంజర్. లవ్ యూ’’ అని పేర్కొన్నారు.
మరోవైపు సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రంపై తన అభిప్రాయం తెలిపారు. చరణ్ అప్పన్న పాత్రలో ఇరగదీశావ్ అంటూ అభినందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘చరణ్ అన్నా.. ‘అప్పన్న’ పాత్రను నువ్వు పోషించిన తీరు నుంచి ఎన్నో విషయాలు గ్రహించా. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా నువ్వు ఎదిగావు. నీపై పూర్తి నమ్మకం ఉంచిన దర్శకుడు శంకర్‌కు నా అభినందనలు. నువ్వు ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో హర్ష, కాలభైరవ (మగధీర), రామ్ (ఆరెంజ్), చిట్టిబాబు (రంగస్థలం), అల్లూరి సీతారామరాజు (ఆర్‌ఆర్‌ఆర్), ఇప్పుడు అప్పన్న (గేమ్ ఛేంజర్) పాత్రలు నాకు బాగా నచ్చినవి. అప్పన్న పాత్రకు ప్రాణం పోశావు. నీ ప్రదర్శన చూస్తుంటే ఒక కలలా అనిపించింది’’ అని తెలిపారు.