IIMC 2025 జనవరి 9 &10 తేదీల్లో నిర్వహించే కళలు, సామాజిక శాస్త్రాలు, పరిశోధన మరియు సాంకేతికతలో డిజిటల్ ఆవిష్కరణలపై రెండు రోజుల జాతీయ సదస్సును దిగ్విజయంగా ముగిసింది. మొదటి రోజు సదస్సును జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించారు. సదస్సు అధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపల్ రఘువీర్ మాట్లాడుతూ 87 పరిశోధన వ్యాసాలు వచ్చాయని అవి అమెరికా ,లండన్ నుండి కూడా వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అతిధి పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతూ మానవుడు చేసే ఆలోచనలే టెక్నాలజీ కంటే ఉత్తమమైనవని, మనిషి ఆలోచన చేస్తే ప్రతిదీ టెక్నాలజీగా మార్చవచ్చని చెప్పారు.
ఇక కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ వి.విశ్వనాథం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సుకతతో ఆలోచనతో పరిశోధన చేసి విశ్లేషణతో పరిశోధన వ్యాసాలను రాసారని తెలియజేశారు. అనంతరం 87 వ్యాసాలతో కూడిన సంక్షిప్త పరిశోధనా వ్యాస సంపుటిని విడుదల చేశారు. ముందుగా పత్ర సమర్పకులకు జ్యూట్ బ్యాగుతో కూడిన విలువైన కిట్టును అందజేశారు. మొదటిరోజు రెండు సెషన్లుగా మొత్తం వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు వివిధ విభాగాలకు సంబంధించిన 38 పరిశోధన పత్రాలు సమర్పణ చేశారు.
రెండో రోజు అంతర్జాలం ద్వారా 24 పత్ర సమర్పణలు చేశారు. మొదటి రోజు సదస్సుకు హాజరై పత్ర సమర్పణ చేసిన వారికి కళాశాల ప్రిన్సిపల్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ముగింపు సమావేశంలో సదస్సు కన్వీనర్ కరుణశ్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి డా.కే .సువర్చల రాణి, డా. అశ్విని , రెండవ బహుమతి డా. డి సంజీవరావు, పి కృషి రెడ్డి భవన్స్ వివేకానంద సైన్స్ అండ్ కామర్స్ కళాశాల, మూడవ బహుమతి డా టి.పావని, మేరీ విజయ శ్రీ అలహరి.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ఐదు ప్రోత్సాహక బహుమతులు డా. శోభారాణి, ప్రగతి మహా విద్యాలయం, అర్జున్ రావు రాజనాల అరోరా డిగ్రీ కళాశాల, అశ్విక, దీపిక ,హరిణి ,డా. కార్తీగ పూజ ఎం.ఓ.పి.కళాశాల చెన్నై, కాజల్ శర్మ, అర్జున్ ఐ ఐ ఎం సి కళాశాల గెలుచుకున్నారు. ఈ సదస్సుకు న్యాయ నిర్ణీతలుగా టి శ్రీనివాస్, శ్రీహరి, ప్రశాంత్, విజయ్, దీపక్, ఇ. రామకృష్ణ, సి ఆర్ ఎల్ కళ్యాణి, సుష్మ వ్యవహరించారు. సదస్సుకు ఉమానంద్, శీతల్ కో కన్వీనర్లుగా, ఇతర అధ్యాపక బృందం సదస్సు విజయవంతం అవడంలో తోడ్పడ్డారు.