కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన పథకాల పేర్లను మార్చిన సర్కార్.. తాజాగా జగనన్న కాలనీల(Jagananna Colony) పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -
ఇకపై ఈ కాలనీలను ‘పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్‌గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఆ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.