తిరుపతిలో ముక్కోటి ఏకాదశి టికెట్ల తొక్కిసలాట ఘటన ప్రకంపణలు సృష్టిస్తోంది. వైకుంఠ దర్శనాల టికెట్ల్ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం.. పాలకమండలి సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
తిరుమలలో జరిగిన ఘటన దురదృష్ట కరమన్న బీఆర్ నాయుడు.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించామని చెప్పారు. ఇక ఘటనపై జ్యుడీషియల్ విచారణకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని… టీటీడీ చైర్మన్ నాయుడు స్పష్టం చేశారు.
అయితే ఉద్దేశ పూర్వకంగా జరిగిన సంఘటన కాదని.. ఏర్పాట్లు సరిగ్గా లేని ఒకటి రెండు చోట్ల ఇది చోటుచేసుకుందని తెలిపారు. మరోవైపు తిరుమలలో జరిగిన ఈ దురదృష్ట కర ఘటనకు కారణమైన వారెవరినీ.. ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.చోట్ల ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్ లు అందిస్తామని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. క్షమాపణ చెప్పడంలో తప్పులేదని.. కానీ అలా చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావని అన్నారు. ఎవరో ఏదో మాట్లాడారని అన్నింటికి స్పందించాల్సిన అవసరమైతే లేదన్నారు.
ఇక తప్పు జరిగింది.. ఇకపై ఇలాంటివి జరగనివ్వమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు టోకెన్ల జారీ కోసం చేసిన ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేదని.. బీఆర్ నాయుడు తెలిపారు. ఈ సంవత్సరం 9రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి ఆగమశాస్త్రాలు, పండితుల నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.