సంక్రాంతి పండుగకు నగరవాసులు పల్లెబాట పట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో(Sankranti Rush) కిటకిటలాడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను 10 గేట్లు ద్వారా.. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను ఆరు గేట్ల ద్వారా సిబ్బంది పంపిస్తున్నారు. శనివారం, ఆదివారం రద్దీ మరింత పెరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. నగరవాసులు సొంతూళ్లకు వెళ్లడంతో హైదరాబాద్‌లోని రోడ్లన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ ట్రావెల్స్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వార్నింగ్ ఇచ్చారు.