గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. దీంతో సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186కోట్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ‘దేవర’ రికార్డును బ్రేక్ చేసింది. దేవర మూవీ తొలి రోజు రూ.172 కోట్లు రాబట్టింది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘గేమ్ ఛేంజర్’కు తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది. వీకెండ్లో ఈ టికెట్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నానా హైరానా’ సాంగ్ సినిమాలో మేకర్స్ తొలగించారు. ఈ పాటను సినిమా ప్రింట్లో అప్ లోడ్ చేసే క్రమంలో ఇన్ఫ్రారెడ్ చిత్రాల ప్రాసెసింగ్ సమయంలో టెక్నికల్ సమస్యలు తలెత్తాయని.. అందుకే ఫైనల్ కాపీలో యాడ్ చేయలేకపోయామని మేకర్స్ ప్రకటించారు. జనవరి 14 నుంచి సినిమాలో ఈ పాటను యాడ్ చేస్తామని చెప్పారు. దీంతో విజువల్ వండర్‌గా తీసిన ఈ పాట కోసం సినిమా మళ్లీ చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అంటున్నారు.