అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభోత్సం చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆసక్తికర ట్వీట్ చేశారు. వందల ఏళ్ల హిందువుల కల సాకారమైన గొప్ప క్షణం ఇది అని తెలిపారు.
- Advertisement -
“వందల ఏళ్ల హిందువుల కల సాకారమైన గొప్ప క్షణం. భారతీయుల అస్తిత్వానికి రూపమిచ్చిన మహోన్నత ఘట్టం. యావత్ హిందూ సమాజం ఎదురుచూసిన ఆత్మగౌరవ ఉత్సవం. అయోధ్యలో వెలసిన దివ్య భవ్య రామ మందిరం. మహాద్భుత మందిరం ఆవిష్కృతమై ఏడాది పూర్తైన శుభసందర్భంగా హిందూ బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జై శ్రీరామ్!” అని ట్వీట్ చేశారు.