Saturday, January 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Sankranti Rush: రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం రండి.. ఏపీ ప్రజలకు టీడీపీ పిలుపు

Sankranti Rush: రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం రండి.. ఏపీ ప్రజలకు టీడీపీ పిలుపు

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి భారీ సంఖ్యలో ఏపీలోని తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో(Sankranti Rush) కిటకిటలాడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ‘ఐటీడీపీ'(iTDP) ఏపీ ప్రజలకు కీలక పిలుపునిచ్చింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

- Advertisement -

“అమరావతిని నిర్మించుకుందాం..విశాఖనీ ఐటీ హబ్ గా తీర్చిదిద్దుకుందాం..రాయలసీమకు పరిశ్రమలు తెచ్చుకుందాం.. 10 ఏళ్లు ఆంధ్రులకి పొరుగు దేశానికి ,రాష్ట్రానికి వెళ్ళే అవసరం లేకుండా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం.. కలసిరండి..ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలి. జై ఆంధ్రప్రదేశ్” అని రాసుకొచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News