Saturday, January 11, 2025
HomeతెలంగాణSiddipet: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఐదుగురు యువకులు మృతి

Siddipet: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఐదుగురు యువకులు మృతి

సిద్దిపేట(Siddipet) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మార్కూర్ మండలం కొండపోచమ్మ సాగర్(Konda Pochamma Sagar) డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు కొండపోచమ్మ సాగర్‌కు వచ్చారు. సరదాగా ఈత కోసం నీళ్లలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఐదుగురు నీట మునిగి చనిపోయారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

- Advertisement -

మృతులను ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు కావడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సరదాగా ఈత కోసం వచ్చి ఒకేసారి ఐదుగురు యువకులు మృతి చెందండం వారి కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News