Saturday, January 11, 2025
Homeనేషనల్YouTube Earnings: యూట్యూబ్ ద్వారా ప్రధాని మోదీ సంపాదన ఎంతో తెలుసా.. బాబోయ్ నెలకు ఇంత...

YouTube Earnings: యూట్యూబ్ ద్వారా ప్రధాని మోదీ సంపాదన ఎంతో తెలుసా.. బాబోయ్ నెలకు ఇంత వస్తుందా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి అందరికీ తెలుసు కానీ ఆయనకు ఒక యట్యూబ్ ఛానల్ ఉందనే విషయం తెలుసా.. ఆయన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా భారీ ఆదాయం సంపాదిస్తున్నారు అదే ఎంతో తెలుసా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికల్లో ప్రాధాన్యతను పొందిన వ్యక్తి. ఆయనకు ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్లలో ఉన్న ఖాతాలు, అలాగే నరేంద్ర మోదీ అనే అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ 2007 అక్టోబర్ 26న ప్రారంభించబడింది. ఆయన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో సహా అన్ని విషయాలను ఈ ఛానల్ ప్రసారం చేస్తుంది.

- Advertisement -

ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం 26.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో ఉన్న ఏకైక రాజకీయ నాయకుడిగా మోదీ నిలిచారు. ఈ ఛానల్ ప్రస్తుతానికి వీడియోలు, లైక్లు, వీక్షణల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతోంది.

ఓ నివేదిక ప్రకారం, ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ ప్రతి నెలా సగటున 189,000 డాలర్లు అంటే (రూ. 1,62,49,520.70) నుంచి 567,100 డాలర్లు అంటే (రూ. 4,87,47,697.38) వరకు సంపాదిస్తోంది. ఈ ఛానల్ ఇప్పటివరకు 29,272 వీడియోలను అప్‌లోడ్ చేయడంతో పాటు 6,360,331,183 వీక్షణలను సాధించింది. ఈ వీడియోల్లో చాలా వరకు 40,000 వీక్షణలను దాటిపోయాయి.

ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్‌లో ప్రతి వారం సగటున 19 వీడియోలు అప్‌లోడ్ చేస్తారు. ఆయనకు ఫేస్‌బుక్‌లో 48 మిలియన్ల మంది ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 82.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్యలు, ఆయన చర్చలు, కార్యక్రమాలు, వీడియోల ద్వారా యూట్యూబ్‌లోని ఆదాయాన్ని మరింత పెంచుతాయి. ప్రధానమంత్రి మోదీ తరువాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో 6.4 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో యూట్యూబ్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. అయితే, మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య బోల్సోనారో కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News