Saturday, January 11, 2025
HomeఆటJadeja: టెస్టులకు జడేజా గుడ్ బై చెప్పేస్తాడా.. అసలు ఏం జరుగుతోంది..?

Jadeja: టెస్టులకు జడేజా గుడ్ బై చెప్పేస్తాడా.. అసలు ఏం జరుగుతోంది..?

స్వదేశంలో న్యూజిలాండ్ పై సిరీస్ ఓటమి.. ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమితో టీమిండియా డీలా పడింది. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్ కు పలువురు క్రికెటర్లు గుడ్ బై చెపుతున్నారు. ఇప్పటికే టీమిండియా టాప్ స్పిన్నర్ అశ్విన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన పోస్ట్‌ను బట్టి చూస్తే జడ్డు కూడా టెస్టులకు వీడ్కోలు పలకనున్నట్లు అనుమానం కలుగుతోంది.

- Advertisement -

తాజాగా జడేజా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా టెస్ట్‌ జెర్సీని షేర్‌ చేశాడు. ఈ క్రమంలో క్రికెట్‌ నిపుణులతో పాటు అభిమానులు ఆల్‌రౌండ్‌ రిటైర్మెంట్‌ గురించి హింట్స్‌ ఇచ్చినట్లుగా చెపుతున్నారు. దీనిపై పలువురు యూజర్లు స్పందిస్తున్నారు.. ఓ యూజర్‌ రిటైర్మెంట్‌కు సంకేతమా అంటూ ప్రశ్నించగా.. మరొకరు శుభాకాంక్షలు తెలిపారు.

గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత టీ20 క్రికెట్‌కు జడేజా రిటైర్మెంట్‌ ప్రకించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెత్త ఫామ్‌ కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. వీరిద్దరంత కాకపోయినా జడేజాపై సైతం విమర్శలు వచ్చాయి. బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను టీమిండియా 1-3 తేడాతో ఓటమిపాలైంది. ఆసిస్‌ పర్యటనలో జడేజా మూడు మ్యాచుల్లో కేవలం నాలుగు వికెట్ల తీశాడు. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.

జడేజా ప్రదర్శనపై సైతం సెలెక్టర్లు సైతం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై టెస్టుల్లో కొనసాగడం కష్టమేనని జడేజా భావించినట్లు సమాచారం. భారత్‌ ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20, మూడు వన్డేలు ఆడనున్నది. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌తో పాటు చాంపియన్స్‌ ట్రోఫీకి సైతం జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఆ సిరీస్ కు కూడా జడ్డుని ఎంపిక చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు క్రీడా నిపుణులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News