మరోమారు అరుదైన అవకాశం డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకులకు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అమరవరపు పెద్ద బజార్, విమల దంపతుల కుమారుడు డప్పు కళాకారుడు జానపద సామ్రాట్ అవార్డు గ్రహీత అమరవరపు సతీష్ కు 2వ సారి అరుదైన అవకాశం దక్కింది.
రిపబ్లిక్ డే వేడుకల్లో
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ మట్టి కళారూపం అయిన డప్పు దరువును రాష్ట్రపతి భవన్ కర్తవ్య పత్ లో మన ఆదినాదం డప్పు దరువులు వినిపించబోతున్నారు. రెండవ సారి అవకాశం కల్పించడం పట్ల ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందె భాస్కర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ,భారత సంగీత నాటక అకాడమీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోతున్న డప్పు దరువుకు ప్రాణం పోస్తున్నా డప్పు సతీష్ కి అవకాశం రావటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.