పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రైల్వే స్టేషన్లలో టికెట్ కొనడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ప్యాసింజర్ రైలు టికెట్లు తీయడం పెద్ద సమస్య అవుతుంది. స్టేషన్ కౌంటర్ వద్ద ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల, టికెట్లు తీసుకోవడం కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇకపై UTS యాప్ ద్వారా ప్యాసింజర్ రైలు టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు.
UTS యాప్ ద్వారా టికెట్ బుకింగ్: ఇంతకు ముందు ఎక్కువ మంది IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసేవారు. కానీ ఇప్పుడు UTS (Unreserved Ticketing System) యాప్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా నార్మల్ టికెట్, ఫ్లాట్ ఫారమ్ టికెట్, సీజన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదనంగా, బుక్ చేసిన టికెట్లను అవసరమైతే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.
5 సెకన్లలో టికెట్ బుకింగ్: UTS యాప్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ యాప్. దీని ద్వారా భద్రంగా టికెట్లు బుక్ చేయవచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, మీ వివరాలతో లాగిన్ అయి, టికెట్ బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేస్తే, అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు చూపిస్తాయి. మీరు అనుకూలమైన రైల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో 5 సెకన్లలోనే టికెట్ బుకింగ్ పూర్తి అవుతుంది. ఇకపై స్టేషన్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. UTS యాప్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ, ఒక ముఖ్యమైన విషయం – స్టేషన్ బయట నుంచే టికెట్ బుక్ చేయాలి. ఇది మర్చిపోవద్దు.