తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో చోరీ యత్నం జరిగింది. శ్రీవారి పరకామణి బంగారం చోరీకి ఓ బ్యాంకు ఉద్యోగి ప్రయత్నించాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. పెంచలయ్య అనే బ్యాంకు ఉద్యోగి వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్‌ను దాచాడు.
- Advertisement -
ఆ ట్రాలీని బయటకు తీసుకెళ్లే క్రమంలో విజిలెన్స్ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షాత్తూ శ్రీవారి బంగారం చోరీకి యత్నించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.