Sunday, January 12, 2025
Homeనేషనల్Republic Day: గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

Republic Day: గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

2025 గణతంత్ర దినోత్సవానికి(Republic Day 2025) ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subianto) హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఆయన ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంటో 2024 అక్టోబర్‌లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

కాగా 1950 నుంచి భారత్..‌ మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహించారు. 2018లో ఆసియాన్‌ దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. 2023లో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి.. 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News