గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నానా హైరానా’ సాంగ్ సినిమాలో మేకర్స్ తొలగించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పాటను ఆదివారం నుంచి థియేటర్లలో యాడ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించబడిన మొట్టమొదటి భారతీయ పాటగా ‘నానా హైరానా’(Naanaa-Hyraanaa) తెరకెక్కింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కార్తీక్, శ్రేయో ఘోషల్ అద్భుతంగా పాడారు. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌లో అన్ని భాషలలో 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పెద్ద హిట్ అయింది.