Sunday, January 12, 2025
Homeచిత్ర ప్రభSankranthi movies: వివాదాల ఉచ్చులో సంక్రాంతి సినిమాలు

Sankranthi movies: వివాదాల ఉచ్చులో సంక్రాంతి సినిమాలు

సెలబ్రిటీ కాంట్రవర్సీస్

సంక్రాంతి సినిమాలపై పుష్ప ఎఫెక్ట్ ఓ రేంజ్ లో పడింది. అందుకే సారీల పర్వానికి తెర లేచింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలపై మాటల యుద్ధం తారాస్థాయికి చేరి, రచ్చరచ్చ అవుతోంది. వెరసి టాలీవుడ్ కొత్త ఛాలెంజీలను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకుల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో అసలు ఈ సంక్రాంతికి టాలీవుడ్ ట్రెండ్స్, ఎలా ఉన్నాయి, వాటి వెనుక కారణాలేంటో పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి.

- Advertisement -

సినిమా ‘హంగామా’నే
భారీ బడ్జెట్, హైలీ పెయిడ్ టాప్ యాక్టర్స్, ఫారిన్ లొకేషన్స్, భారీ సెట్స్, ప్యాన్ ఇండియా ఇమేజ్, సాంగ్స్ లో వందలాది మంది ఆర్టిస్టులు కలర్ఫుల్ గా కనిపించేస్తే సినిమా హిట్ అవుతుందా? తెలుగు సినిమాలన్నీ ఇదే మూస ధోరణిలో తయారవుతుంటే ఇదేదో హిట్ ఫార్ములాగా ఇదే మూసలో వచ్చిన చాలా సినిమాలు దెబ్బైపోయాయి.
సినిమా కాస్ట్లీ అఫైర్
ఇదంతా ఒక ఎత్తైతే సినిమా ప్రమోషన్ కోసం ఇంకో సినిమా తీసేందుకు అయ్యేంత బడ్జెట్, రికార్డులు సృష్టించేలా కటౌట్లు, సినిమా ఫంక్షన్లు, ఆ ఫంక్షన్లకు వచ్చి పోయే ఫ్యాన్స్ కు రోడ్డు ప్రమాదాలు, రక్త తర్పణాలు ఇది ఇంకో ఎపిసోడ్. ఒక్కో టికెట్ వేల రూపాయలు పెట్టి కొంటేనే తొలి రోజు తొలి ఆట అనిపించుకునే బెనిఫిట్ షూస్, ఈ షో టైంలో సినిమా టీం హంగామాతో జరిగే తొక్కిసలాటలు మనవాళ్లకు బాగా పరిచయం. సినిమా తీయటం ప్రొడ్యూసర్ కు ఎంత ఆర్థిక భారమో, ఇలా తీసిన సినిమాను ప్రేక్షకులు చూడాలంటే కూడా అంతే ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినా వీటన్నింటినీ పక్కన పెట్టి ఫలానా హీరో, డైరక్టర్ అనే ఇంట్రెస్ట్ తో థియేటర్స్ కు వెళ్లేవాళ్లే ఎక్కువ. భారీ బడ్జెట్ సినిమాల ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో వాటికి ఆకర్షితులవుతారనే అంచనాలు ఇండస్ట్రీలో సహజంగానే ఉంటున్నాయి. అలా వచ్చినదే గేమ్ ఛేంజర్.
ముందే ఊహించినందుకే
జస్ట్ పాటల కోసం 75 కోట్లు ఖర్చు చేసినట్టు ఆర్భాటంగా చెప్పిన డైరక్టర్ శంకర్ సినిమాలో పాటల ఆడియో-వీడియో బాగుంటాయి కానీ గేమ్ ఛేంజర్ సినిమాలో పాటలు సోసో అనిపించుకుంటే ఒక పాట ఏకంగా మిస్ అయిపోయింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ముందే యూనిట్ ఊహించనట్టు ఇప్పుడిప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక షోలు వేసుకోవచ్చని అర్ధరాత్రి దాటాక రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వటం, టికెట్ రేట్లు పెంచటానికి ఒప్పుకోవటం అంతా చూస్తుంటే గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ లో బోల్తా కొడుతుందని దర్శక-నిర్మాతలు ఊహించేసినట్టున్నారని ఫిలిం నగర్ లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రత్యేక అనుమతులు మళ్లీ తేనెతుట్టెను కదిలించాయి. సినిమాలు-రాజకీయాలు పెనవేసుకొన్న రంగాలైనప్పటికీ ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజుల్లో తరచూ రాజకీయాలు చోటుచేసుకోవటం రొటీన్ గా మారిపోయింది.
ఎందుకీ భారీ బడ్జెట్లు?
సినిమా మేకింగ్ అంటే ఇంత కాస్ట్లీ ఎందుకు అవుతోంది?. భారీ బడ్జెట్ అయితేనే హిట్ అవుతాయా? భారీ బడ్జెట్ అయితేనే జనం చూస్తారా? ఆమధ్య సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ అయితే ఏకంగా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకపోతే ఇలాంటి సినిమాలు ఎవరూ తీయరని బెదిరించినట్టు విషయాన్ని వివరించటం అందరికీ షాక్ ఇచ్చింది.
కళ్లు తెరిపించిన సోనూ సూద్
ఇక లేటెస్ట్ గా సోనూ సూద్ చెబుతున్న వివరాలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ఫతే సినిమా డైరెక్టర్, హీరో కూడా అయిన సోనూ సినిమాలకు బడ్జెట్ ఎందుకు పెరుగుతోందో, అందులోని స్టార్ క్యాస్ట్ తో పాటు వాళ్ల పంక్చువాల్టీ వంటి విషయాలపై ఓపన్ గా చెప్పటం చూస్తే ఈ భారమంతా చివరికి ప్రేక్షకులు ఎందుకు మోయాల్సిన దౌర్భాగ్యం పడుతోందో అర్థమవుతుంది.
సంక్రాంతి బరిలో ఈ భారీతనమున్న సినిమాలకే ప్రయారిటీ

సంక్రాంతి బరిలో ఫ్యామిలీ సినిమాలకు టాలీవుడ్ లో పెద్ద మార్కెట్ ఉంది. దశాబ్దాలుగా సంక్రాంతి సినిమాలు అందుకే సీనియర్ హీరోలకు సెంటిమెంటల్ గా మారాయి. ఈసారి కూడా బాలయ్య, వెంకటేష్ సినిమాలు డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలపై ఇప్పటికే తెలుగు వారిని ఊరిస్తున్నాయి. ఒక్క దిల్ రాజును పక్కనపెడితే సంక్రాంతికి వస్తున్నాం టీం చాలా వరకు అతి జాగ్రత్తగా పీఆర్ మేనేజ్ చేస్తూ, వివాదాలకు దూరంగా ఉంటూ, మా సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఆకట్టుకునేందుకు సర్వం ఒడ్డుతోంది.

పుష్పకు ముందు తరువాత అన్నట్టు పరిస్థితి
సంక్రాంతి సినిమాల మార్కెట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద పరీక్షగా మారింది. పుష్ప సినిమా వివాదంతో తెలంగాణ ప్రేక్షకులు, ఆంధ్రా ఆడియన్స్ గా తెలుగు సినిమా ప్రేక్షకులు మారిపోవటం టాలీవుడ్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. పుష్పను తెలంగాణ ప్రేక్షకులు ఆదరిస్తే గేమ్ ఛేంజర్ ను ఆంధ్రా ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు కలెక్షన్ల ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారి ఈ మార్పు పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పుష్ప టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల దెబ్బ ప్రతి రిలీజ్ పై ఉండటంతో సినిమాలు, సినీ నటుల మాటలు-చేష్టలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఏ హీరోకు సపోర్ట్ చేయాలో, ఇండస్ట్రీలో ఎవరెవరిని ట్రోల్ చేసి ఇమేజ్ ను దెబ్బతీసి, సినిమాను ఫ్లాప్ బాట పట్టించాలన్న విషయాలపై తెలంగాణ పార్టీలు పూర్తి స్పష్టతతో అజెండా డ్రైవ్ చేస్తున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గతంలో ఇవన్నీ తెరవెనుక సైలెంట్ గా సాగిపోగా పుష్ప వివాదం కారణంగా ఇలాంటి వ్యవహారాలు ఓపన్ సీక్రెట్స్ గా మారిపోయాయి.

తెల్ల కల్లు, మటన్ ముక్కలు
ఆంధ్రాలో సినిమాలకు వైబ్ ఉంటే తెలంగాణలో మాత్రం తెల్ల కల్లు మటన్ ముక్కలకే వైబ్ ఉంటుందని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచారు. గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో దిగొచ్చిన దిల్ రాజు సారీ అంటూ క్షమాపణలు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాంపై తెలంగాణ ప్రజలు ఇదే తీరు చూపితే పరిస్థితి ఏమిటని డ్యామేజ్ కంట్రోల్ కు దిగిన దిల్ రాజు తన సినిమాలకు మాత్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారనే టాక్ సోషల్ మీడియా ట్రాలింగ్ లో గట్టిగా వినిపిస్తోంది.

దబిడి దిబిడీగా
డాకూ మహారాజ్ సినిమాలో తెగ వైరల్ అయిన దబిడి దిబిడి పాట స్టెప్స్ వివాదాస్పదంగా మారాయి. ఓవైపు జూనియర్ ఫ్యాన్స్ డాకూ సినిమాను బాయ్ కాట్ చేస్తామని సోషల్ మీడియాలో గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. బాబీ-జూనియర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ జై లవకుశ ప్రస్తావన రాకుండా అడ్డుకున్నారని తారక్ ఫ్యాన్ రగిలిపోతున్నారు. బాబీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు, ఆ సినిమాల్లో హీరోల గురించి ప్రస్తావించి జై లవకుశను ఎందుకు ప్రస్తావించలేదనే కోపంలో డాకూకు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయన్నమాట. బాలయ్య భారీ డైలాగులు ఓవైపు, కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన ప్రొడ్యూసర్ నాగవంశీ మాటలతో ప్రేక్షకులు ఆగ్రహంగా ఉన్నారు. 1500 రూపాయలు పెట్టి సినిమా చూస్తే తప్పేంటి అంటూ నాగవంశీ టికెట్లపై చేసిన షాకింగ్ కామెంట్స్ కూడా ఈ టైంలో డ్యామేజింగ్ ఎఫెక్ట్ చూపుతాయని సినిమా బృందం కూడా టెన్షన్ లో ఉంది. అందుకే ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందని ఇండస్ట్రీలో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News