ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E-Race) కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) తెలిపారు. తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందన్నారు. ఈ-కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే తాను చెప్పానని కానీ అవినీతి జరగలేదని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. అంతేకానీ తాను కేటీఆర్కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి తాను ఏమి మాట్లాడనని పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్ ఖాళీగా ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయాలని చెప్పుకొచ్చారు. ఇక హైడ్రా వల్ల పార్టీకి నష్టం జరిగిందని.. హైడ్రాపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని కోరారు. మూసీ ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని దానం వ్యాఖ్యానించారు. మూసీపై బీజేపీ నేతలు కంటి తుడుపు చర్యల్లా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని విమర్శించారు