హీరో వెంకటేశ్(Venkatesh) కుటుంబానికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్(Deccan Kitchen Hotel) కూల్చివేత కేసులో దగ్గుబాటి ఫ్యామిలీ(Daggubati Family) అభియోగాలు ఎదుర్కొంటోంది. హోటల్ విషయంలో గత కొంత కాలం క్రితం దగ్గుబాటి కుటుంబానికి, నందకుమార్‌కు మధ్య వివాదం నెలకొంది. తాను లీజుకు తీసుకున్న దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని నందకుమార్ కోర్టును ఆశ్రయించారు.
- Advertisement -
తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దగ్గుబాటి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో సురేశ్‌బాబు (ఏ1), వెంకటేశ్ (ఏ2), రానా (ఏ3), అభిరామ్ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే విచారణ చేయనున్నారు.