Sunday, January 12, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి సలహాలైనా స్వీకరిస్తా: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి సలహాలైనా స్వీకరిస్తా: రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి సలహాలైనా స్వీకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు (Vidya Sagar Rao) ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావుని తామంతా ‘సాగర్ జీ’ అని పిలుచుకుంటామని అన్నారు. ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి స్వీయ చరిత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. విద్యాసాగర్‌ రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు.

- Advertisement -

ప్రతిపక్షం.. పాలక పక్షం కలిస్తేనే ప్రభుత్వమన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించలేదన్నారు. మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదు.. ప్రపంచస్థాయి నగరాలతో అన్నారు. తెలంగాణ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నామన్నారు. మెట్రో, రీజనల్‌ రింగ్‌రోడ్డు విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరానని తెలిపారు. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News