నటసింహం బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. సినిమాలో బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, థమన్ బీజీఎం గూస్ బంప్స్ అని చెబుతున్నారు. దీంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన అనంతపురంలోనే సక్సెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే వేడుక తేదీ ప్రకటిస్తామన్నారు.
కాగా తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే 4 నుంచి 8 వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాలు వెల్లడించాయి.