కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith) దుబాయ్ వేదికగా జరుగుతున్న కారు రేసింగ్ పోటీల్లో విజయం సాధించారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ టీమ్ 24H దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక యాక్సిడెంట్ జరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేసులో పాల్గొనడంతో అజిత్‌కు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డు దక్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు అజిత్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
కాగా కార్లు, బైక్ రేసింగ్ అంటే అజిత్‌కు ఇష్టం అన్న సంగతి తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా స్నేహితులతో కలిసి బైక్ ట్రిప్స్‌కు వెళ్తూ ఉంటారు. అలాగే కార్ రేసింగ్‌ల్లో కూడా పాల్గొంటారు. దీంతో ప్రొఫెషనల్ రేసర్‌గా అజిత్‌కు గుర్తింపు వచ్చింది. 13 ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్‌లో పాల్గొన్నారు. ఈ రేసు కోసం ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ నడుపుతున్న కారు గోడను బలంగా ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగాడ్యామేజ్ అయింది. అయితే అజిత్‌కు ఎలాంటి గాయాలు కాకపోడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.