త్వరలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) కోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బోర్డులు జట్లును ప్రకటించాయి. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక టూర్‌కు దూరంగా ఉన్న కమిన్స్ తిరిగి ఆసీస్ జట్టులోకి వచ్చాడు. ఇక కివీస్ జట్టుకు సాంట్నర్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు ఛాంపియన్స్ ట్రోపీ జరగనుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, నాథన్ ఎలిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జంపా
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డేవన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, నాథన్ స్మిత్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, బెన్ సీర్స్, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, లాకీ ఫెర్గూసన్, టామ్ లేథమ్, మిచెల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరౌర్కీ