తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు.. ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలను సీఎం ఆకాంక్షించారు. ఈమేరకు సోమవారం తెలంగాణ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది.
అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగి మంటలు.. పాడి పంటలు.. పిండి వంటలు.. రంగవల్లులు.. గంగిరెద్దుల ఆటపాటలు.. పతంగుల రెపరెపలు. సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజైన భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ ప్రజలందరి జీవితాల్లోకి భోగభాగ్యాలు తీసుకురావాలని ఆశిస్తున్నాను.’ అని తెలిపారు. ఇక వీరితో పాటు ఇతర నేతలు కూడా ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెప్పారు.