Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుTelangana: నలుగురి ప్రాణాలు తీసిన హోలీ వేడుకలు

Telangana: నలుగురి ప్రాణాలు తీసిన హోలీ వేడుకలు

హోలీ వేడుకలు కొన్ని కుటుంబాల్లో విషాదం నింపింది. మానేరువాగుల స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షలు పరిహారం ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈమేరకు మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా చెక్కుల అందజేత జరుగనుంది.

- Advertisement -

కరీంనగర్ జిల్లాలో హోలీ వేడుకల్లో ముగ్గురు యువకులు స్నానానికని మానేరు వాగులోకి దిగి మృతి చెందారు. హోళి పండుగ రోజు ముగ్గురు పిల్లల మృతి చెందడం బాధాకరం అని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులకు, అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మృతులు కుటుంబాలకు అండగా ఉంటామని వారి కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ తరుపున మరో 2 లక్షలరూపాయలను అందజేస్తామని మంత్రి వెల్లడించారు
హోలీ సంబరాలు చేసుకొని స్నానానికి అలుగునూర్ మానేర్ వాగులోకి వచ్చిన యువకులు మానేరు వాగులో రివర్స్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలో పడి యువకులు మృతి చెందారు. మృత్తులంతా ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలానికి చెందినవారని, వారి తల్లిదండ్రులు వలస కూలీలుగా ఉంటూ జీవనం సాగిస్తుంటారని, మృతుల పేర్లు వీరాంజనేయులు (16), సంతోష్ (13), అనిల్ (14).

ఇటు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోనూ పండగ పూట విషాదం చోటుచేసుకుంది. తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి కి చెందిన గొల్ల ప్రదీప్ (19) హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తాండూరుకి మూడు రోజుల క్రితం హోలీ పండుగ జరుపుకోవడానికి ఇంటికి వచ్చిన ప్రదీప్, హోలీ సంబరాలు జరుపుకొని స్నేహితులతో పాత తాండూరులోని కాగ్న నదిలో స్నానాలు చేసుకోవడానికి వెళ్లి.. నీట మునిగి మరణించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News