తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏ ఊరు చూసినా పండుగ శోభతో కళకళలాడుతోంది. మరోవైపు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురం గ్రామంలో వెలసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ఫ్లెక్సీలో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR), నటసింహం బాలకృష్ణ(Bala Krishna) ఫొటోలు ఉండటం విశేషం.
చంద్రబాబు ఫొటో కింద బాస్ ఈస్ బ్యాక్.. కేసీఆర్ ఫొటో కింద బాస్ ఈస్ కమింగ్ సూన్, బాలకృష్ణ ఫొటో కింద ‘డాకు మహారాజ్’ అని క్యాప్షన్లు జత చేశారు. ఇక ఇదే ఫ్లెక్సీలో లోకేశ్, కేటీఆర్, మోక్షజ్ఞ ఫొటోలు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఈ ఫ్లెక్సీ చూసిన జనం ఇదేందరయ్యా అంటూ షాక్‌కు గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.