రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్(PRABHAS) నటిస్తోన్న హర్రర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’(RajaSaab) నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లుక్‌లో తమ హీరో అదిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.