Wednesday, January 15, 2025
Homeనేషనల్ISRO Chairman: ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వి.నారాయణన్

ISRO Chairman: ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వి.నారాయణన్

ఇస్రో చైర్మన్‌(ISRO Chairman)గా డాక్టర్ వి.నారాయణన్(V. Narayanan) బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 14, 2027 వరకు రెండు సంవత్సరాల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన..ఆదిత్య L1, చంద్రయాన్2, చంద్రయాన్ -3 వంటి చారిత్మక ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. చైర్మన్ కంటే ముందు కేరళలోని వలియమాలాలో ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ చీఫ్‌గా పని చేశారు.

- Advertisement -

కాగా ఐఐటీ ఖరగ్ పూర్‌లో క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చదివిన నారాయణన్.. అక్కడే ఏరో స్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. రాకెట్ అనుబంధ రంగంలో ఆయనకు ఉన్న ప్రతిభను గుర్తించి ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ అందించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News