Wednesday, January 15, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 15th Episode: అయ్యబాబోయ్.. ట్విన్ టవర్స్ రోహిణి వాళ్ల నాన్నవి...

Gunde Ninda Gudigantalu January 15th Episode: అయ్యబాబోయ్.. ట్విన్ టవర్స్ రోహిణి వాళ్ల నాన్నవి అంట.. ప్రభావతికి కరెక్ట మొగుడు శృతినే..

ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి శృతితో రోహిణి వాళ్ల నాన్న గొప్పలు చెప్తుంది. ఓరినాయనో ట్విన్ టవర్స్ వీళ్లవేనంట. ప్రభావతి చెప్పే గొప్పలకు రోహిణి పరువు పోయేలా ఉంది. ఆ ఉంటే కదా పోవడానికి. రవి, శృతి వాళ్ల బట్టలు తెచ్చుకోవడానికి గెస్ట్ హౌస్‌కి వెళ్తారు. రవి వాళ్లకి ఏ గది ఇవ్వాలో తెలియక ఆలోచిస్తూ మీనా గదికి వచ్చి రూమ్ అంతా శుభ్రం చేసి పెట్టు ఈ గదిలోనో వాళ్ల శోభనం జరుగుతుంది అంటుంది. అప్పుడు మీనా వాళ్లకి రూమ్ ఇస్తే మేము ఎక్కడ పడుకోవాలి అని అడుగుతుంది. నువ్వు మీ ఇంట్లో ఎలా పడుకునేదానివి కిందే కదా ఇప్పుడు బెడ్ కావాలా అని ప్రభావతి మీనాను ఇన్‌సల్ట్ చేస్తుంది. అప్పుడు మీనా నా గురుంచి వదలేయండి మీ అబ్బాయి అసలు ఒప్పుకోడు రవికి అని చెప్తే అసలా ఒప్పుకోరు అంటే నువ్వు ఒప్పించు అంటే పల్లు రాలగోడతారు మీవి కాదు నావే అంటుంది మీనా.

- Advertisement -

మొత్తానికి మీనాని రూమ్ కోసం బతిమాలుతుంది ప్రభావతి, బాలుని ఒప్పించు అని చెప్తుంది. సత్యం కోసం రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ బాలుని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంది మీనా. ఈలోగా బాలు ఇంటికి వచ్చి కాఫీ ఇమ్మని అడుగుతాడు. పైకి రూమ్కి తీసుకురా అంటే ఇక్కడే హాల్‌లో కూర్చోండి ఇస్తాను అంటే ఏ పైకి నాలుగు మెట్లు ఎక్కలేవా అని రూమ్‌కి వెళ్లిపోతాడు. రూమ్‌కి కాఫీ పట్టుకెళ్తుంది. బాలు రూమ్‌కి వెళ్లి చూసే సరికి గది అంతా పూలోతే ఫస్ట్‌నైట్ రూమ్ రెడీ అయ్యి ఉంటుంది. బాలు ఏమో వాళ్లకే ఫస్ట్‌నైట్ అనుకుని ఓ మురిసిపోతాడు. మీనా ఇది మనకోసం కాదు రవి, శృతి కోసం అంటే బాలు కోప్పడుతుంది. కిందకి వచ్చి ప్రభావతితో గొడవ పడుతాడు. ఇంట్లో ఇంకే రూమ్‌ లేదు ఇప్పుడు ఇస్తే ఏమైపోతుంది అని రోహిణి అడుగుతుంది.

మీనా బాలుని ఏదోలా ఒప్పిందామని పక్కకి లాక్కెళ్తుంది. కొత్తగా పెళ్లి అయిన వాళ్లని ఇలా ఇబ్బంది పెడతారా అంటుంది. పోన్లే మొత్తానికి ఒప్పుకుని రూమ్‌లో చాప తీసుకుని మేడ మీదకి వెళ్లి పడుకుంటాడు. అలా పైకి వెళ్లిన బాలు దగ్గరికి రవి మాట్లాడడానికి వెళ్తాడు.ఇంతటితో ఎపిసోడు పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News