విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. మూవీలో వెంకీ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. దీంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
వెంకటేష్ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. కాగా వెంకీ, అనిల్ కాంబోలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్ 3’ తర్వాత ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలుగా నటించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.