ఫార్ములా-ఈ రేసు(Formula-E Race) కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ జరిపింది.
- Advertisement -
కాగా ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అక్కడ కూడా ఊరట లభించకపోవడంతో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారేమో అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.