ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసు(Skill Devolepment Scam Case)లో బెయిల్ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్జిస్. బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు న్యాయస్థానం బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని సూచించింది. దీంతో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. కాగా 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట
సంబంధిత వార్తలు | RELATED ARTICLES