తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీకి మంచు మనోజ్(Manchu Manoj) వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వుల గురించి మోహన్ బాబు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్‌బాబు(Mohan Babu), మంచు విష్ణు ఉన్నారు.
కాగా మనోజ్ కుంటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో యూనివర్సిటీకి భారీ ర్యాలీగా వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరినీ అనుమతించడంలేదు. గేట్లను కూడా మూసివేశారు. దీంతో అక్కడ ఏం జరగనుందనే టెన్షన్ మొదలైంది. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే.