Wednesday, January 15, 2025
Homeచిత్ర ప్రభKalki 2: ‘కల్కి2’ సినిమాపై నిర్మాత అశ్వనీదత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Kalki 2: ‘కల్కి2’ సినిమాపై నిర్మాత అశ్వనీదత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్‌(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) గతేడాది విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

‘కల్కి 2’ మూవీ వచ్చే ఏడాది విడుదలవుతుందన్నారు. రెండో పార్ట్‌ మొత్తం లోకనాయకుడు కమల్ ‌హాసనే ఉంటారని.. ప్రభాస్‌ , కమల్‌ హాసన్‌ల మధ్య మంచి సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మూడు పాత్రలే సినిమాలో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. వీరితో పాటు హీరోయిన్ దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు.

కాగా వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించగా.. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News