ఈరోజు ఎపిసోడ్‌లో జోత్స్న కొట్టిన దెబ్బకు దాసు గట్టిగా అరిస్తే ఆ అరుపుకు దశరథ బయటికి వచ్చి చూస్తాడు. అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా ఆవిడ దగ్గరకే వెళ్లు అంటుంది. దాసుని జోత్స్న కొట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఎక్కడికి తీసుకెళ్తుంది అని జోత్స్న కారు వెనకాల ఫాలో అవుతాడు. నా గురించి నిజం తెలిసిన ఎవరూ బ్రతకూడదు అని రాయి తీసుకుని కొట్టబోతుంది. ఈలోపు ఎవరో కారు హార్న్ విని దాసుని వదిలేసి వెళ్లిపోతుంది.
మరోవైపు కార్తిక్ శౌర్యను ఇంటికి తీసుకెళ్తు ఆపరేషన్ ఎలా చేయించాలని ఆలోచిస్తాడు. శౌర్య మాత్రం నేను అంతా విన్నాను ఏమైంది నాకు అని అడుగుతుంది. ఏం కాలేదు రౌడీ నీకు కొంచెం బలం తగ్గింది అంతే అంటాడు. సరే ఈ విషయాలు అమ్మకు చెప్పొద్దు నీకు ఏమి కావాలంటే అవి ఇస్తాను అంటే అయితే నాకు ఆ లాకెట్ కావాలి అని అడుగుతుంది శౌర్య. సరే ఇస్తాను అమ్మకు మాత్రం చెప్పవద్దు అంటాడు. అక్కడ సుమిత్ర ఏమో ఎవరైనా ఉంటే తలుపు తీయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈలోగా పారిజాతం వచ్చి డోర్ తీస్తుంది. డోర్ ఎవరు లాక్ చేసారు అని అడిగితే నేను మీ మామయ్య ఇప్పుడే గుడికి వెళ్లి వచ్చాము నాకు తెలియదు అంటుంది పారిజాతం. జోత్స్నను ఎక్కడికి వెళ్లావు అని అడిగితే మర్డర్ చేయడానికి వెళ్లాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరొకవైపు హాస్పిటల్లో దశరథ నా కూతురు ఎందుకు దాసును చంపాలనుకుంది. నేను చూసిందంతా నిజమేనా దాసుని జోత్స్న ఎందుకు చంపాలి అనుకుంది, మొన్న ఇంటికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. దాసు లెగిస్తేనే నిజం తెలుస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఎవరు కొట్టారు అలా అని అడుగుతాడు కొట్టడం కాదు అది ఆక్సిడెంట్ అంటాడు. నేను డాక్టర్‌ని అని అంటాడు, దాసు బతకడం కష్టమే అని చెప్పడంతో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాడు నా తమ్ముడు వాడిని బతికించాలి అని డాక్టర్‌తో చెప్తాడు. నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని డాక్టర్‌తో చెప్తాడు.
అక్కడ కార్తీక్ మందులు సౌర్యకి వేయి అంటే శౌర్యకి ఏమైంది ఇన్ని మందులు ఎందుకు నిజం చెప్పండి అని కార్తిక్‌ను అడుగుతుంది. నిజం చెప్పి నీ మనసు బాధ పెట్టలేను అని మనసులో అనుకుంటాడు. మరోవైపు జోత్స్న చేసిన పనికి భయపడతూ ఉంటుంది. అప్పుడే ఇంటకి వచ్చిన ధశరథ జోత్స్న వైపు కోపంగా చూస్తాడు. డాడీ ఏంటి నా వైపు కోపంగా చూస్తున్నారేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.