Thursday, January 16, 2025
Homeచిత్ర ప్రభChiranjeevi: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. విచారం వ్యక్తంచేసిన చిరంజీవి

Chiranjeevi: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. విచారం వ్యక్తంచేసిన చిరంజీవి

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌(Saif ali khan)పై జరిగిన దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని సెలబ్రెటీలు తీవ్రంగా ఖండిస్తూ సైఫ్‌కు తమ మద్దతు తెలియజేస్తున్నారు.

- Advertisement -

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సైఫ్‌ అలీఖాన్‌పై దాడి తనను ఎంతగానో కలచివేసిందని.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు.

అంతకుముందు ఎన్టీఆర్(NTR) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘సైఫ్‌ సార్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆకాంక్షించారు.

కాగా ముంబై బాంద్రాలోని నివాసంలో సైఫ్ అలీఖాన్‌పై దాడి జ‌రిగింది. గురువారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల స‌మ‌యంలో ఓ దొంగ వారి ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు. దొంగ‌ను ప‌ట్టుకునేందుకు సైఫ్ య‌త్నించ‌గా.. దుండ‌గుడు క‌త్తితో దాడి చేసి అక్క‌డ నుంచి ప‌రారయ్యాడు. గాయ‌ప‌డిన సైఫ్‌ను వెంట‌నే కుటుంబ స‌భ్యులు ముంబైలోని లీలావ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రికిలో సైఫ్‌ చికిత్స పొందుతున్నారు. ఆయన ఒంటిపై ఆరు చోట్ల కత్తి గాట్లు పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News