మంచు కుటుంబం వివాదం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మనోజ్(Manchu Manoj) చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బుధవారం తనను యూనివర్సిటీ దగ్గర అడ్డుకున్న పరిణామాలను డీఎస్పీకి వివరించారు.
కాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తన కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించేందుకు బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ దంపతులు చేరుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి అంటూ మండిపడ్డారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తన తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు.
ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోహన్ బాబు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లు వివాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. అంతక ముందు మనోజ్, భార్య మౌనికలు.. రంగంపేటకు చేరుకుని మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు.